IND vs AUS, World Cup Final: నరేంద్ర మోడీ స్టేడియంపై సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అద్భుత విన్యాసాల వీడియోలు ఇవిగో, రెండు రోజుల ముందే రిహార్సల్స్‌ షురూ చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

అహ్మదాబాద్‌ (Ahmedabad) వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా ( India Vs Australia) మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ ఈ ఆదివారం జరగనున్న సంగతి విదితమే. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రపంచకప్‌ ఫైనల్లో భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌ ప్రదర్శనలు ఇవ్వబోతోంది

Indian Air Force Surya Kiran team Rehearse At Narendra Modi Stadium In Ahmedabad

అహ్మదాబాద్‌ (Ahmedabad) వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా ( India Vs Australia) మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ ఈ ఆదివారం జరగనున్న సంగతి విదితమే. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రపంచకప్‌ ఫైనల్లో భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌ ప్రదర్శనలు ఇవ్వబోతోంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు రెండు రోజులే ఉంటడంతో ఏరోబాటిక్‌ టీమ్‌ తాజాగా రిహార్సల్స్‌ (Surya Kiran aerobatic Team Rehearsals)ను మొదలు పెట్టేసింది. స్టేడియంపై సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫైనల్‌ పోరు మొదలయ్యే పది నిమిషాల ముందు స్టేడియంపై సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆకాశంలో అద్భుత విన్యాసాలతో అలరించనున్నాయి. మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు రకరకాల ఆకారాలతో అబ్బురపరుచనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఎయిర్‌షో రిహార్సల్స్‌ను నిర్వహిస్తోంది. ఇక ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రెండు జట్ల మధ్య వరల్డ్‌కప్‌ తుదిపోరు ప్రారంభకానుంది.

Indian Air Force Surya Kiran team Rehearse At Narendra Modi Stadium In Ahmedabad

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now