ICC World Cup 2023 New Schedule Released: భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో మార్పులు, భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు

అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ (ఆగస్ట్‌ 9) అధికారికంగా ప్రకటించింది.

babar Azam And Rohit Sharma

భారత్‌ వేదికగా ఈ ఏడాది (2023) అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ (ఆగస్ట్‌ 9) అధికారికంగా ప్రకటించింది.ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఒక రోజు ముందుకు (అక్టోబర్‌ 14) మారింది.భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో మార్పులు ఇవిగో..

India vs Pakistan Officially Shifted to October 14, See Full List of CWC Fixtures After Changes
List-of-Revised-Fixtures