James Anderson Stunning Catch Video: ఫుల్‌ లెంగ్త్‌ డైవ్‌ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ అందుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌, యశస్వీ జైశ్వాల్‌ను పెవిలియన్‌కు పంపిన వీడియో ఇదిగో..

నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ స్టార్ జేమ్స్‌ ఆండర్సన్‌ కళ్లు చెదిరే క్యాచ్ తో మెరిసాడు. యశస్వీ జైశ్వాల్‌ను స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఆండర్సన్‌ పెవిలియన్‌కు పంపాడు.

41-year-old James Anderson takes stunning catch to dismiss Yashasvi Jaiswal

రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ స్టార్ జేమ్స్‌ ఆండర్సన్‌ కళ్లు చెదిరే క్యాచ్ తో మెరిసాడు. యశస్వీ జైశ్వాల్‌ను స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఆండర్సన్‌ పెవిలియన్‌కు పంపాడు. భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 17 ఓవర్‌ వేసిన జో రూట్‌ బౌలింగ్‌లో మూడో బంతిని జైశ్వాల్‌ ఆఫ్‌ సైడ్‌ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బంతిలో టర్న్‌ ఎక్కువగా వుండడంతో ఎడ్జ్‌ తీసుకుని బ్యాక్‌వర్డ్ పాయింట్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న 41 ఏళ్ల ఆండర్సన్‌ ఫుల్‌ లెంగ్త్‌ డైవ్‌ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  జో రూట్‌ స్పిన్‌ ట్రాప్‌లో చిక్కుకున్న యశస్వీ జైశ్వాల్‌, చెప్పేది వినవా అంటూ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్, వీడియో ఇదిగో..

Here's Video and Pics

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)