Kedar Jadhav Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌ కేదార్‌ జాదవ్‌, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కేదార్‌.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు. కేదార్‌ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్‌లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు.

Kedar Jadhav. (Photo- X)

టీమిండియా ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కేదార్‌.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు. కేదార్‌ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్‌లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్‌ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. 2020 ఫిబ్రవరిలో (న్యూజిలాండ్‌ పర్యటనలో) జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన కేదార్‌ 2019 వన్డే ప్రపంచకప్‌ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ కామెంటేటర్‌గా దినేశ్ కార్తీక్, మొత్తం 41 మందితో వ్యాఖ్యాతల జాబితాను ప్రకటించిన ఐసీసీ

2010 నుంచి 2023 సీజన్‌ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్‌.. ఐపీఎల్‌ కెరీర్‌లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.  దేశవాలీ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టు తరఫున 87 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 186 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు.

Here's Tweet

 

View this post on Instagram

 

A post shared by Kedar Mahadev Jadhav (@kedarjadhavofficial)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు