IPL 2022: లక్నోపై విరుచుకుపడిన షమీ, ఐపీఎల్‌లో బోణీ కొట్టిన గుజరాత్‌ టైటాన్స్, 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం

ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రెండు కొత్త జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను విజయం వరించింది. బౌలింగ్‌లో మహమ్మద్‌ షమీ (3/25) మెరుపులకు.. బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌ సహకారం తోడవడంతో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

Mohammed Shami (Photo/IPL PTI)

ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రెండు కొత్త జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను విజయం వరించింది. బౌలింగ్‌లో మహమ్మద్‌ షమీ (3/25) మెరుపులకు.. బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌ సహకారం తోడవడంతో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో నీర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీపక్‌ హుడా (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుష్‌ బదోనీ (41 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. గుజరాత్‌ బౌలర్లలో మహమ్మద్‌ షమీ 3, వరుణ్‌ అరోన్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 33; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌), వేడ్‌ (30), మిల్లర్‌ (30), రాహుల్‌ తెవాటియా (24 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అభినవ్‌ మనోహర్‌ (7 బంతుల్లో 15 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో చమీర 2 వికెట్లు పడగొట్టాడు. షమీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement