IPL 2023: వైరల్ వీడియో, భువనేశ్వర్ పాదాలను తాకిన డేవిడ్ వార్నర్, పైకి లేపి ఆలింగనం చేసుకున్న స్టార్ బౌలర్
ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కాలికి దండం పెట్టాడు.
ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కాలికి దండం పెట్టాడు. టాస్ సందర్భంగా మైదానంలోకి వచ్చిన వార్నర్ పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడే వార్మాప్ చేస్తున్న భువీ పాదాలను తాకాడు. వెంటనే భువీ వార్నర్‌ను పైకి లేపి ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వార్నర్, భువనేశ్వర్ కలిసి కొన్ని సీజన్‌లపాటు సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)