IPL 2023: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా నితీశ్ రాణా, సంచలన నిర్ణయం తీసుకున్న కెకెఆర్, గాయంతో టోర్నీకి దూరమైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
గాయపడిన రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో కెప్టెన్‌గా సీనియర్ ఆటగాడిని ఎన్నుకుంది.
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గా నితీశ్ రాణా పేరును ప్రకటించింది. గాయపడిన రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో కెప్టెన్‌గా సీనియర్ ఆటగాడిని ఎన్నుకుంది. వెన్ను సమస్య కారణంగా అయ్యర్ 2023 సీజన్ తొలి అర్ధ భాగం మ్యాచ్‌లకు దూరం కానున్న నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ ఎంపిక అనివార్యం కాగా, కేకేఆర్ యాజమాన్యం నితీశ్ రాణావైపు మొగ్గుచూపింది.
2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాణా.. ఇప్పటివరకు 91 మ్యాచ్‌లు ఆడి 2181 పరుగులు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016 నుంచి 2018 వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాణా.. అప్పటి నుంచి వరుసగా 6 సీజన్ల పాటు (2023 కలుపుకుని) కేకేఆర్‌కే ఆడుతున్నాడు. గత సీజన్ వేలంలో రాణాను కేకేఆర్ 8 కోట్లకు సొంతం చేసుకుంది.
Here's KKR Tweet