IPL 2023: లాస్ట్ బాల్ డ్రామా వీడియోలు ఇవిగో, ర‌స‌వ‌త్త‌ర పోరులో చివరి బంతికి గెలిచిన లక్నో, వర్కవుట్ కాని హ‌ర్ష‌ల్ ప‌టేల్ ప్లాన్

ల‌క్నో(Lucknow Super Giants) జ‌ట్టు చివ‌రి బంతికి అనూహ్య రీతిలో విక్ట‌రీ కొట్టింది. అయితే హ‌ర్ష‌ల్ ప‌టేల్(Harshal Patel) వేసిన ఆ ఓవ‌ర్‌లో హైడ్రామా చోటుచేసుకున్న‌ది.మొద‌టి 5 బంతుల్లో వుడ్‌, ఉన‌ద్క‌త్ ఔట్ కాగా నాలుగు ర‌న్స్ వ‌చ్చాయి

Harshal Patel (Photo-IPL)

ఐపీఎల్‌లో బెంగుళూరుతో జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర పోరులో .. ల‌క్నో(Lucknow Super Giants) జ‌ట్టు చివ‌రి బంతికి అనూహ్య రీతిలో విక్ట‌రీ కొట్టింది. అయితే హ‌ర్ష‌ల్ ప‌టేల్(Harshal Patel) వేసిన ఆ ఓవ‌ర్‌లో హైడ్రామా చోటుచేసుకున్న‌ది.మొద‌టి 5 బంతుల్లో వుడ్‌, ఉన‌ద్క‌త్ ఔట్ కాగా నాలుగు ర‌న్స్ వ‌చ్చాయి. అయితే చివ‌రి బంతికి ఒక ర‌న్ చేయాల్సి ఉంది. స్ట్ర‌యికింగ్‌లో అవేశ్ ఖాన్‌, నాన్‌స్ట్ర‌యిక‌ర్‌గా ర‌వి బిష్ణోయ్ ఉన్నారు. ఆరో బంతిని వేస్తూ నాన్ స్ట్ర‌యిక‌ర్‌ను ఔట్ చేయాల‌ని హ‌ర్ష‌ల్ ప్ర‌య‌త్నించాడు. బిష్ణోయ్ ప‌రుగెత్త‌పోయాడు. కానీ హ‌ర్ష‌ల్ తొలుత వికెట్ల‌ను తాక‌డంలో విఫ‌లం అయ్యాడు.

ఆ త‌ర్వాత ర‌నౌట్‌కు ప్ర‌య‌త్నించాడు. అయితే ఆ అటెంప్ట్‌లో కూడా హ‌ర్ష‌ల్ స‌క్సెస్ కాలేదు.నాన్ స్ట్ర‌యిక‌ర్‌(Non Striker)ను ఔట్ చేయాల‌ని ప్ర‌య‌త్నించి అందులో సక్సెస్ కాక‌పోతే ఆ బంతిని మ‌ళ్లీ వేయాల్సిందే. ఇక చివ‌రి బంతి కీప‌ర్ చేతుల్లోకి వెళ్లినా దినేశ్ దాన్ని స‌రిగా అందుకోలేక‌పోయాడు. ఈ లోపు అవేశ్ ఖాన్ ఒక ప‌రుగు తీశాడు. ఆ ఉత్కంట పోరులో ల‌క్నో గెయింట్స్ చివ‌రి బంతికి విక్ట‌రీ సాధించింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)