IPL 2023: వీడియో ఇదిగో, కోహ్లికి ఝూమ్ జో పఠాన్ పాటకు డ్యాన్స్ నేర్పించిన షారుక్, బాద్‌షాను అనుకరిస్తూ స్టెప్‌లు వేసిన విరాట్
ప్రత్యేక గ్యాలరీలో షారుఖ్ కూర్చుని తన జట్టును సపోర్ట్ చేస్తూ కన్పించాడు.
ఐపీఎల్-2023లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ బాద్‌షా, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ప్రత్యేక గ్యాలరీలో షారుఖ్ కూర్చుని తన జట్టును సపోర్ట్ చేస్తూ కన్పించాడు. తమ బౌండరీలు బాదినప్పడు, బౌలర్లు వికెట్లు పడగొట్టనప్పడు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ షారుఖ్ ఖాన్ అభినందించాడు.
మ్యాచ్ అనంతరం షారుక్ మైదానంలోకి వచ్చి ఇరు జట్ల ఆటగాళ్లతో సరదగా ముచ్చటించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి కింగ్ ఖాన్ డ్యాన్స్ నేర్పించాడు. తన సూపర్ హిట్ మూవీ పఠాన్‌లోని 'ఝూమ్ జో పఠాన్' పాటకు స్టెప్‌లను షారుక్ నేర్పించాడు. కోహ్లి బాద్‌షాను అనుకరిస్తూ స్టెప్‌లు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)