IPL 2023: రూ. 13.25 కోట్లు ఎందుకు బ్రో, ఏ స్థానంలో వచ్చిన చెత్తగా ఆడి వెళుతున్నావు, హ్యారీ బ్రూక్‌ వరుస వైఫల్యాలపై మండిపడుతున్న SRH అభిమానులు

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వరుస వైఫల్యాల కథ కొనసాగుతుంది.రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్రూక్‌ ఆ తర్వాత జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్‌ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్‌ వచ్చినా అదే ఆటతీరు కనబరుస్తున్నాడు.

KKR Vs SRH (PIC @ IPL Twitter)

నిన్న కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌ నాలుగో స్థానంలో వచ్చి డకౌట్‌ అయ్యాడు. అయితే ఇదే కేకేఆర్‌పై ఈ సీజన్‌లో సెంచరీ మార్క్‌ అందుకున్న బ్రూక్‌ ఈసారి మాత్రం చెత్తగా ఔట్‌ అయ్యాడు. స్పిన్‌ ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. అనుకుల్‌ రాయ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు మరోసారి దొరికిపోయాడు.

రూ. 4 కోట్లు పెట్టి కొంటే దరిద్రంగా ఆడుతున్నావు, చివరి ఓవర్లో గెలిపిస్తావనుకుంటే చెత్తగా అవుటయ్యావు, అబ్దుల్‌ సమద్‌పై మండిపడుతున్న SRH అభిమానులు

అనుకుల్‌ ఫుల్‌లెం‍గ్త్‌ డెలివరీ వేయగా.. బ్రూక్‌ అడ్డుకునే ప్రయత్నంలో ప్యాడ్లకు తాకింది. దీంతో ఎల్బీగా వెనుదిరిగాడు. బ్రూక్‌ ఆటతీరుపై అభిమానులు మరోసారి ట్రోలింగ్‌కు దిగారు. ''ఏ స్థానంలో వచ్చినా అదే ఆటతీరు..ఇక ఆడించింది చాలు.. బెంచ్‌కు పరిమితం చేయడం మేలనుకుంటా'' అని కామెంట్లు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now