Reece Topley Catch Video: ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ చూడని క్యాచ్, రోహిత్ శర్మను అద్భుత‌మైన క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన రీస్ టాప్లీ, వీడియో ఇదిగో..

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆట‌గాడు రీస్ టాప్లీ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో స్టేడియంలోని ప్రేక్ష‌కులంద‌రినీ షాక్ అయ్యేలా చేశాడు. భారీ షాట్ల‌తో విరుచుకుప‌డుతున్న‌ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మను టాప్లీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియ‌న్‌కు పంపాడు.

Reece Topley Catch Video

ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే వేదిక‌గా గురువారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆట‌గాడు రీస్ టాప్లీ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో స్టేడియంలోని ప్రేక్ష‌కులంద‌రినీ షాక్ అయ్యేలా చేశాడు. భారీ షాట్ల‌తో విరుచుకుప‌డుతున్న‌ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మను టాప్లీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియ‌న్‌కు పంపాడు.ఎంఐ ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో రెండో బంతిని హిట్‌మ్యాన్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు స్వీప్ షాట్ కొట్టాడు.  హైటెన్షన్ మ్యాచులో పంజాబ్ ను చిత్తు చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్..పంజాబ్ పై 2 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం

దాంతో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టాప్లీ అమాంతం ఎడ‌మ‌వైపు గాల్లోకి ఎగిరి ఒంటిచేతితో అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. టాప్లీ ప‌ట్టిన ఆ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో అప్ప‌టివ‌ర‌కు ముంబై అభిమానుల కేరింత‌ల‌తో ద‌ద్ద‌రిల్లిన వాంఖ‌డే స్టేడియం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. ఈ స్ట‌న్నింగ్ క్యాచ్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే మునుపెన్న‌డూ చూడ‌ని అద్భుత‌మైన క్యాచ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Corbin Bosch Creates History: పాకిస్థాన్ పై మ్యాచ్ లో చెల‌రేగిన ఆట‌గాడు, అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టి స‌రికొత్త రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా క్రికెట‌ర్

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.