IND vs ENG 2nd Test 2024: స్టంప్ ఔట్ మిస్ చేసిన వికెట్ కీపర్ భరత్, కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ ఎలా ఉందో చూడండి..
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ రెండో బంతికి డకెట్‌ను ఔట్ చేశాడు. అనంతరం పోప్ క్రీజులోకి వచ్చాడు. అయితే తన ఎదుర్కొన్న తొలి బంతినే అద్బుతమైన డెలవరీగా కుల్దీప్ సంధించాడు. ఆ బంతిని అంచనా వేయడంలో పోప్ విఫలమయ్యాడు. బంతి పోప్ బ్యాట్‌ను మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వేళ్లింది.వికెట్ కీపర్ భరత్ సైతం బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు
విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులు చేసింది.అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్.. ఎప్పటిలాగే దూకుడుగా ఆడింది.253 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్టారర్ బ్యాటర్ ఓలీ పోప్ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ రెండో బంతికి డకెట్‌ను ఔట్ చేశాడు. అనంతరం పోప్ క్రీజులోకి వచ్చాడు. అయితే తన ఎదుర్కొన్న తొలి బంతినే అద్బుతమైన డెలవరీగా కుల్దీప్ సంధించాడు. ఆ బంతిని అంచనా వేయడంలో పోప్ విఫలమయ్యాడు. బంతి పోప్ బ్యాట్‌ను మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వేళ్లింది.వికెట్ కీపర్ భరత్ సైతం బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఒకవేళ బంతిని అందుకుని బెయిల్స్‌ను పడగొట్టి ఉంటే పోప్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చెరేవాడు. రిప్లేలో క్లియర్‌గా పోప్ క్రీజుకు బయట ఉన్నట్లు కన్పించింది. వెంటనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత పనిచేశావు భరత్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు.
Here's Pics
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)