IPL 2024: ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ కోచ్‌‌గా లసిత్‌ మలింగ, బ్యాటింగ్‌ కోచ్‌గా వెస్టిండీస్‌ కీరన్‌ పొలార్డ్‌, కీలక ప్రకటన చేసిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్‌-2024 సీజన్‌లో బౌలింగ్‌ కోచ్‌గా శ్రీలంక లెజెండరీ పేసర్‌ లసిత్‌ మలింగను ప్రకటించింది. ఇక బ్యాటింగ్‌ కోచ్ గా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ పేరును ప్రకటించింది

Lasith Malinga appointed new bowling coach for Mumbai Indians ahead of IPL 2024

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో బౌలింగ్‌ కోచ్‌గా శ్రీలంక లెజెండరీ పేసర్‌ లసిత్‌ మలింగను ప్రకటించింది. ఇక బ్యాటింగ్‌ కోచ్ గా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ పేరును ప్రకటించింది. తొమ్మిదేళ్లపాటు ముంబై ఇండియన్స్‌ కోచ్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ షేన్‌ బాండ్‌తో ఫ్రాంఛైజీ తెగదెంపులు చేసుకున్న తరుణంలో మలింగకు ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

మలింగ ఐపీఎల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. 2008 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో భాగంగా 122 మ్యాచ్‌లు ఆడి రికార్డు స్థాయిలో 170 వికెట్లు తీశాడు.అదే విధంగా.. 2013, 2015, 2017, 2019లో ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యుడైన మలింగ ఖాతాలో నాలుగు టైటిళ్లు ఉన్నాయి. ఇక ప్లేయర్‌గా 2021లో రిటైరైన తర్వాత మలింగ బౌలింగ్‌ కోచ్‌గా అవతారమెత్తాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు 2022, 2023 సీజన్లలో పేస్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు ముంబై క్యాంపులో పునరాగమనం చేయనున్నాడు.

Lasith Malinga appointed new bowling coach for Mumbai Indians ahead of IPL 2024

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)