Latest ICC Rankings: ఏడవ స్థానానికి దిగజారిన విరాట్ కోహ్లీ, టాప్‌లో ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌, రెండవ స్థానంలో ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌, ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్ల హవా

ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్ల హవా కొనసాగింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌ టాప్ లో నిలిచాడు.

Virat Kohli (Photo Credits: IANS)

ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్ల హవా కొనసాగింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌(103, 51) 912 పాయింట్లతో.. ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌(897)ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోగా, స్టీవ్‌ స్మిత్‌(884) మూడో స్థానంలో, డేవిడ్‌ వార్నర్‌(775) ఆరు, ట్రవిస్‌ హెడ్‌(728) పదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 5వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, టెస్ట్‌ సారధి విరాట్‌ కోహ్లి ఓ స్థానాన్ని కోల్పోయి 7వ ప్లేస్‌లో ఉన్నాడు.

భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఐసిసి టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ పట్టిక పరంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కుమ్మిన్స్ మొదటి స్థానంలో ఉన్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now