Mitchell Starc: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన మిచెల్ స్టార్క్, ఏకంగా రూ. 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కోలకతా నైట్ రైడర్స్

మిచెల్ స్టార్క్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు అయ్యాడు, పాట్ కమ్మిన్స్ తర్వాత 20 కోట్లకు పైగా బిడ్ పొందిన రెండవ క్రికెటర్ అయ్యాడు; ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ని రూ. 24.75 కోట్లకు కోలకతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది

Mitchell Starc (Photo Credits: @thesportsbash/Twitter)

మిచెల్ స్టార్క్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు అయ్యాడు, పాట్ కమ్మిన్స్ తర్వాత 20 కోట్లకు పైగా బిడ్ పొందిన రెండవ క్రికెటర్ అయ్యాడు; ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ని రూ. 24.75 కోట్లకు కోలకతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం గుజరాత్‌ టైటాన్స్‌, కేకేఆర్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి.

ఆఖరికి గుజరాత్‌ టైటాన్స్‌ టైటాన్స్‌ వెనక్కి తగ్గడంతో కేకేఆర్‌ సొంతం చేసుకుంది. కాగా ఇదే వేలంలో ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల రికార్డు ధరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు స్టార్క్‌ డీల్‌తో కమ్మిన్స్‌ రికార్డు బద్దలైంది. కాగా స్టార్క్‌ ఐపీఎల్‌లో చివరగా 2015 సీజన్‌లో ఆర్సీబీ తరపున ఆడాడు. ప్రస్తుతం వరల్డ్‌క్లాస్‌ పేసర్లలో స్టార్క్‌ ఒకడు. ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ స్టార్క్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement