Mohammed Shami: మొహమ్మద్ షమీ బద్దలు కొట్టిన పలు ప్రపంచ రికార్డులు ఇవిగో, వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల సాధించిన బౌలర్‌గా కొత్త చరిత్ర
శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ పలు ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల సాధించిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 3 సార్లు ఈ ఘనత సాధించగా.. షమీ ఇప్పుడు ఆ రికార్డును సమం చేశాడు.
శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ పలు ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల సాధించిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 3 సార్లు ఈ ఘనత సాధించగా.. షమీ ఇప్పుడు ఆ రికార్డును సమం చేశాడు.వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు(45) తీసిన భారత బౌలర్‌గా షమీ అవతరించాడు.
షమీ ఈ ఘనతను 14 మ్యాచ్‌ల్లోనే అందుకోవడం విశేషం. జహీర్ ఖాన్ (23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు), జవగళ్ శ్రీనాథ్ (34 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు.అలాగే భారత్ తరఫున వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను అత్యధికంగా నాలుగుసార్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్ మూడుసార్లు చొప్పున ఈ ఘనత సాధించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)