IPL 2023: ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్ షాక్, చీలమండ గాయంతో స్టార్ స్పిన్నర్ నూర్‌ ఆహ్మద్‌ దూరం, టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం

ఆ జట్టు స్పిన్నర్‌ నూర్‌ ఆహ్మద్‌కు తీవ్రగాయమైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన నూర్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ స్ట్రైట్‌గా భారీ షాట్‌ ఆడాడు.

Noor-ahmad

ఐపీఎల్‌-2023లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది.తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్‌ నూర్‌ ఆహ్మద్‌కు తీవ్రగాయమైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన నూర్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ స్ట్రైట్‌గా భారీ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో బంతి నూర్‌ ఆహ్మద్‌ యాంకిల్‌ (చీలమండ)కు బలంగా తాకింది.దీంతో వెంటనే అతడు మైదానంలో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు.

వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడిని మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. అతడి బౌలింగ్‌ కోటా తెవాటియా పూర్తి చేశాడు. కాగా నూర్‌ అహ్మద్‌ గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు