PAK vs ENG: పాక్ నుంచి మరో మెరుపు బౌలర్, ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు పడగొట్టిన లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌, ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన పాక్ బౌలర్

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ తొలి ఏడు వికెట్లను కూడా అబ్రార్‌ అహ్మద్‌ సాధించాడు.

Abrar Ahmed Pak (Photo-Twitter/PAK Cricket)

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ తొలి ఏడు వికెట్లను కూడా అబ్రార్‌ అహ్మద్‌ సాధించాడు. ఈ క్రమంలో ట్విటర్‌ వేదికగా అబ్రార్‌ అహ్మద్‌ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక అబ్రార్‌ అహ్మద్‌ ఏడు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటైంది.టెస్టు అరంగేట్రం తొలి సెషన్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టిన పాక్‌ బౌలర్‌గా అబ్రార్ అహ్మద్ నిలిచాడు. అదే విధంగా అరంగేట్ర టెస్టులో తొలి రోజు ఐదు వికెట్లు ఘనత సాధించిన రెండో పాక్‌ బౌలర్‌గా అహ్మద్ నిలిచాడు. అంతకుముందు పాక్‌ పేసర్‌ వహబ్‌ రియాజ్‌ తన డెబ్యూ టెస్టు మొదటి రోజులో ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా డెబ్యూ టెస్టులో ఐదు వికెట్ల హాల్‌ సాధించిన 13వ పాకిస్తాన్‌ బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

Here's Pak Cricket Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement