Harleen Deol asks PM Modi Skincare: వీడియో ఇదిగో, సర్, మీ స్కిన్ ఎప్పుడూ చాలా గ్లోగా ఉంటుంది, మీ స్కిన్‌కేర్ రొటీన్ ఏంటి? హర్‌లీన్ డియోల్ ప్రశ్నతో నవ్వుల్లో మునిగిన ప్రధాని మోదీ
మహిళల వన్డే వరల్డ్‌కప్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా అమ్మాయిలతో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటించారు. ప్రతి మహిళను వ్యక్తిగతంగా పలకరించి, వారి ఆట, అనుభవాల గురించి తెలుసుకున్నారు. కానీ ఈ చర్చలో ఓ సరదా క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది.

సంభాషణ మధ్యలో భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్ హర్‌లీన్ డియోల్ ప్రధానిని చిరునవ్వుతో ఉద్దేశించి ఓ విచిత్రమైన ప్రశ్న అడిగింది. “సర్, మీ స్కిన్ ఎప్పుడూ చాలా గ్లోగా ఉంటుంది. మీ స్కిన్‌కేర్ రొటీన్ ఏంటి?” అని. ఈ ప్రశ్న విన్న వెంటనే అక్కడ నవ్వుల వెల్లువ చెలరేగింది. ప్రధానితో పాటు జట్టు సభ్యులు కూడా కాసేపు నవ్వు ఆపుకోలేకపోయారు.
అనూహ్యంగా వచ్చిన ఈ ప్రశ్నకు ప్రధాని మోదీ మొదట కాసేపు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత చిరునవ్వుతో స్పందిస్తూ నేను అటువంటి విషయాల గురించి అంతగా ఆలోచించను అని చెప్పారు. ఆయన సమాధానంతో హాల్‌లో మరలా నవ్వులు పూశాయి. సంభాషణంతా సరదాగా సాగిన ఈ భేటీలో మోదీ జట్టును అభినందిస్తూ.. వారి కష్టపాటు, క్రమశిక్షణను ప్రశంసించారు. భారత మహిళా జట్టు చరిత్రాత్మక విజయంపై దేశం గర్వపడుతోందని, యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని తెలిపారు.
Harleen Deol asks PM Modi Skincare:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)