Rahul Mankad Dies: భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ కుమారుడు రాహుల్ మన్కడ్ మృతి, అనారోగ్యంతో బాధపడుతూ లండన్‌లో కన్నుమూత
అనారోగ్యంతో బాధపడుతూ లండన్‌లో తుదిశ్వాస విడిచాడు. వినూ మన్కడ్ మూడో కుమారుడు రాహుల్ 1972 నుంచి 85 వరకు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ కుమారుడు, మాజీ క్రికెటర్ రాహుల్ మన్కడ్ (66) కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధపడుతూ లండన్‌లో తుదిశ్వాస విడిచాడు. వినూ మన్కడ్ మూడో కుమారుడు రాహుల్ 1972 నుంచి 85 వరకు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 47 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 2,111 పరుగులు చేయగా.. వాటిలో 5 సెంచరీలు, 12 అర్ధ శతకాలు ఉన్నాయి. రాహుల్ సోదరులు అశోక్, అతుల్ కూడా క్రికెటర్లే. వీరిద్దరూ గతంలోనే మృతిచెందారు. వినూ మన్కడ్ పేరు మీదుగానే క్రికెట్‌లో ‘మన్కడింగ్’ పేరు వచ్చిన సంగతి తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)