Ravi Ashwin 100 Tests: అశ్విన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు, 100వ టెస్ట్ ఆడుతున్న 14వ ఇండియన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పిన టీమిండియా స్పిన్నర్

టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టు అశ్విన్‌కి కెరియర్‌లో వందో టెస్టు మ్యాచ్. ఈ రికార్డు నెలకొల్సిన 14వ ఇండియన్‌గా చరిత్రలోకి అశ్విన్ ఎక్కాడు

Ravichandran Ashwin becomes first Indian to achieve rare feat to complete 1000 runs and 100 wickets

టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టు అశ్విన్‌కి కెరియర్‌లో వందో టెస్టు మ్యాచ్. ఈ రికార్డు నెలకొల్సిన 14వ ఇండియన్‌గా చరిత్రలోకి అశ్విన్ ఎక్కాడు. 99 టెస్టుల్లో 507 వికెట్లు పడగొట్టిన అశ్విన్ 116 వన్డేల్లో 156 వికెట్లు తీసుకున్నాడు. 65 టీ20ల్లో 72 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 35 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా, 8సార్లు 10 వికెట్లు చొప్పున పడగొట్టాడు.  వెనకకు 20 గజాల దూరం పరిగెత్తుతూ శుబ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌, ఇంగ్లండ్ బ్యాటర్ డకెట్‌ను పెవిలియన్‌కి పంపిన సూపర్‌ క్యాచ్‌ వీడియో ఇదిగో..

స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన అనిల్ కుంబ్లే రికార్డును బద్దలుగొట్టాడు. స్వదేశంలో 350 టెస్టు వికెట్ల మార్కును ఎప్పుడో దాటేశాడు. రాజ్‌కోట్‌ టెస్టులో 500 వికెట్ల మార్కును దాటేసి అనిల్ కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఇండియన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఆ ఘనత సాధించిన 9వ బౌలర్ అశ్వినే.

టెస్టుల్లో ఇంగ్లండ్‌పై 1000కిపైగా పరుగులు, 100 వికెట్లు సాధించిన తొలి ఇండియన్ అశ్వినే. ఓవరాల్‌గా నాలుగో ఆటగాడు.నేటి టెస్టుతో అశ్విన్ భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్ (200), రాహుల్ ద్రవిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), విరాట్ కోహ్లీ (113), ఇషాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), పుజారా (103) సరసన చేరాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement