Yashasvi Jaiswal Dismissal Video: జో రూట్‌ స్పిన్‌ ట్రాప్‌లో చిక్కుకున్న యశస్వీ జైశ్వాల్‌, చెప్పేది వినవా అంటూ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్, వీడియో ఇదిగో..

భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 17 ఓవర్‌లో జో రూట్‌ స్పిన్‌ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. జో రూట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన జైశ్వాల్‌.. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఆండర్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీనిపై నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.

Rohit Sharma 'Cries His Heart Out' As Yashasvi Jaiswal Plays A Loose Shot To Get Out

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. రాంఛీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేసిన జైశ్వాల్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 37 పరుగులతో రాణించాడు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మతో కలిసి మొదటి వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అన్ని విభాగాల్లో ర‌ఫ్ఫాడించిన టీమిండియా, ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్ విజ‌యంతో సిరీస్ కైవ‌సం, నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం

అయితే భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 17 ఓవర్‌లో జో రూట్‌ స్పిన్‌ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. జో రూట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన జైశ్వాల్‌.. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఆండర్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీనిపై నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.జైశ్వాల్‌ వైపు చూస్తూ నేను చెప్పా కదా.. కొంచెం వినాలిగా అంటూ రియాక్షన్‌ ఇచ్చాడు. అంతకు ముందు బంతి ఎక్కువగా టర్న్‌ అవుతుంది, కాస్త ఆచతూచి ఆడమని పలుమార్లు జైశ్వాల్‌ను హిట్‌మ్యాన్‌ హెచ్చరించాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement