రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు(Team India) అద్భుత విజయం సాధించింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టు మ్యాచులో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ తొలి టెస్టులో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆ మరుసటి మ్యాచ్‌లోనే తిరిగి పుంజుకున్న టీమిండియా.. వరుసగా విజయాలు సాధించింది.
ఇంగ్లండ్ యువ స్పిన్నర్లు టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. శుభ్‌మన్ గిల్(52 నాటౌట్) హాఫ్ సెంచరీ, ధ్రువ్ జురెల్(39 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో విజయ భేరీ మోగించింది. దీంతో పన్నెండేండ్ల క్రితం 2-1తో సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్‌పై రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది.
ఇంగ్లాండ్ : తొలి ఇన్నింగ్స్ 353, రెండో ఇన్నింగ్స్ 145
భారత్ : తొలి ఇన్నింగ్స్ 307, రెండో ఇన్నింగ్స్ 192/5 (విన్)