Shane Warne No More: ఈ శతాబ్దపు అత్యుత్తమ బంతి షేర్న్ వార్న్‌దే, బాల్ ఆఫ్ ది సెంచరీగా నిలిచిపోయిన డెలివరీ వీడియో మీకోసం
1993లో యాషెస్ సిరీస్‌లో భాగంగా మైక్ గాటింగ్‌ను వార్న్ ఔట్ చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. ఈ శతాబ్దపు అత్యుత్తమ బంతిగా ఆ డెలివరీ గురించి చెప్పుకుంటారు. వార్న్ మృతికి సంతాపంగా ఆ వీడియోను అందరూ షేర్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించడమే కాకుండా ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా నిలిచేవాడు. మరి అలాంటి వార్న్ కెరీర్‌లో ఒక బంతి బాల్ ఆఫ్ ది సెంచరీగా నిలిచిపోయింది. 1993లో యాషెస్ సిరీస్‌లో భాగంగా మైక్ గాటింగ్‌ను వార్న్ ఔట్ చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. ఈ శతాబ్దపు అత్యుత్తమ బంతిగా ఆ డెలివరీ గురించి చెప్పుకుంటారు.
బంతిని నేరుగా గాటింగ్ కాళ్లకు ముందు అవుట్‌సైడ్ లెగ్‌స్టంప్‌పై వేసి ఆఫ్ వికెట్‌ను ఎగరుగొట్టిన తీరు ఇప్పటికీ చిరస్మరణీయమే. అసలు బంతి ఎక్కడ పడుతుందా అని గాటింగ్ అంచనా వేసే లోపే ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఆ బంతికి గాటింగ్ షాక్ కాగా, ఫీల్డ్‌లో ఉన్న అంపైర్‌కు కూడా కాసేపు ఏమీ అర్థం కాలేదంటే అది ఎంతలా స్పిన్ అయ్యి ఉంటుందో( ఎంతలా స్పిన్ చేశాడో) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వార్న్ మృతికి సంతాపంగా ఆ వీడియోను అందరూ షేర్ చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)