Shubman Gill Super Catch Video: వెనకకు 20 గజాల దూరం పరిగెత్తుతూ శుబ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్, ఇంగ్లండ్ బ్యాటర్ డకెట్‌ను పెవిలియన్‌కి పంపిన సూపర్ క్యాచ్ వీడియో ఇదిగో..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 18 ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ ఆరో డెలివరీని బెన్ డకెట్‌కు గుగ్లీగా సంధించాడు.
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్- భారత్ మధ్య ఆఖరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 18 ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ ఆరో డెలివరీని బెన్ డకెట్‌కు గుగ్లీగా సంధించాడు. ఈ క్రమంలో డకెట్ లాంగ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్ 20 గజాల దూరం వెనకకు పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.58 బంతుల్లో 27 పరుగుల వద్ద డకెట్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. సచిన్ టెండూల్కర్ భారీ సిక్సర్ బాదిన వీడియో ఇదిగో, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బౌలింగ్‌ని ఉతికి ఆరేసిన లిటిల్ మాస్టర్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)