Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌కు మరో అవార్డు, క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సెలక్ట్ చేసిన బీసీసీఐ, వన్డేల్లో గతేడాదంతా అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్

టీమిండియా స్టార్ శుభ్‌మన్‌ గిల్‌ను క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు వరించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరగబోయే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గిల్‌కు ఈ అవార్డు అందించనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Shubman Gill (Photo-Twitter/BCCI)

టీమిండియా స్టార్ శుభ్‌మన్‌ గిల్‌ను క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు వరించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరగబోయే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గిల్‌కు ఈ అవార్డు అందించనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. వన్డేల్లో గతేడాదంతా అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు గాను గిల్‌కు ఈ అవార్డు దక్కనుందని సమాచారం​. గిల్‌ వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును అందుకున్నాడు.

ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన గిల్‌.. 6 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీల సాయంతో 2271 పరుగులు చేశాడు. 20 టెస్ట్‌లు ఆడిన గిల్‌.. 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీల సాయంతో 1040 పరుగులు.. 14 టీ20ల్లో సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 335 పరుగులు సాధించాడు.

Here's PTI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now