India vs Pakistan, Viral Video: పాకిస్థాన్ తొలి వికెట్ తీసిన సిరాజ్, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ పాకిస్థాన్ తొలి వికెట్ పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గత మ్యాచులో సెంచరీ విజేత అబ్దుల్లా షఫీక్ ను ఎల్బీడబ్ల్యూ చేసి ఔట్ చేశాడు. దీంతో షఫీక్ 24 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు.
వన్డే ప్రపంచ కప్-2023లో 12వ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా 19 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 2 వికెట్లకు 103 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. అబ్దుల్లా షఫీక్ 20 పరుగులు, ఇమామ్ ఉల్ హక్ 36 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం క్రీజులో ఉన్నారు. మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.అయితే టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ పాకిస్థాన్ తొలి వికెట్ పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గత మ్యాచులో సెంచరీ విజేత అబ్దుల్లా షఫీక్ ను ఎల్బీడబ్ల్యూ చేసి ఔట్ చేశాడు. దీంతో షఫీక్ 24 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)