ICC T20 World Cup 2024: అన్రిచ్‌ నోకియా దెబ్బకు పోరాటం చేయకుండానే చేతులెత్తేసిన శ్రీలంక, టీ20 మెన్స్ వరల్డ్ కప్‌లో 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం

టీ20 వరల్డ్‌ కప్‌లో మాజీ చాంపియన్‌ శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేసింది. సౌతాఫ్రికా బౌలర్లు సమిష్టిగా రాణించగా నిప్పులు చెరిగే బంతులుతో విజృంభించిన పేసర్‌ అన్రిచ్‌ నోకియా (4/7) సంచలన స్పెల్‌కు లంకేయులు విలవిల్లాడారు.

South Africa Defeat Sri Lanka By Six Wickets in ICC T20 World Cup 2024

టీ20 వరల్డ్‌ కప్‌లో మాజీ చాంపియన్‌ శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేసింది. సౌతాఫ్రికా బౌలర్లు సమిష్టిగా రాణించగా నిప్పులు చెరిగే బంతులుతో విజృంభించిన పేసర్‌ అన్రిచ్‌ నోకియా (4/7) సంచలన స్పెల్‌కు లంకేయులు విలవిల్లాడారు. ఫలితంగా దక్షిణాఫ్రికా.. 6 వికెట్ల తేడాతో హసరంగ సేనపై ఘనవిజయం సాధించింది. సఫారీ బౌలర్ల ధాటికి మొదట బ్యాటింగ్‌ చేసిన లంక.. 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌట్‌ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా సైతం తడబాటుకు లోనై విజయం కోసం 16.2 ఓవర్లు ఆగాల్సి వచ్చింది. క్వింటన్‌ డికాక్‌ (27 బంతుల్లో 20, 1 సిక్స్‌), క్లాసెన్‌ (22 బంతుల్లో 19 నాటౌట్‌, 1 ఫోర్‌, 1 సిక్స్‌) రాణించారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement