Asian Games 2023: ఆప్ఘాన్ బౌలర్ల ధాటికి పేక మేడలా కుప్పకూలిన శ్రీలంక, 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఘన విజయం
హాంగ్‌జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్-3లో శ్రీలంకపై 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో ఆఫ్గాన్ జట్టు అడుగుపెట్టింది. 117 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో లంక కేవలం 108 పరుగులకే కుప్పకూలింది.
ఏషియన్ గేమ్స్ 2023 పురుషల క్రికెట్‌లో శ్రీలంకకు ఆఫ్గానిస్తాన్‌కు బిగ్ షాకిచ్చింది. హాంగ్‌జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్-3లో శ్రీలంకపై 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో ఆఫ్గాన్ జట్టు అడుగుపెట్టింది. 117 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో లంక కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ నైబ్, కైస్ అహ్మద్ తలా మూడు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు జహీర్ ఖాన్, జనత్, ఆష్రాప్ తలా ఒక్క వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్.. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో 116 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్గాన్ బ్యాటర్లలో నూర్ అలీ జద్రాన్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో నువాన్ తుషారా 4 వికెట్లు పడగొట్టగా.. సహన్ అరాచ్చిగే రెండు, సమరాకూన్ తలా, విజయ్‌కాంత్ చెరో వికెట్ సాధించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)