Suresh Raina Retires: అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా, ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు స్పష్టం, మ‌ద్ద‌తు ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెబుతూ ట్వీట్

క్రికెట‌ర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్ల‌తో పాటు ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు అత‌ను స్ప‌ష్టం చేశారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున రైనా ఐపీఎల్ ఆడాడు. అయితే 2022 సీజ‌న్‌లో ఆ జ‌ట్టు అత‌న్ని ఎంపిక చేయ‌లేదు.

Suresh Raina (Photo Credits: Getty Images)

క్రికెట‌ర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్ల‌తో పాటు ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు అత‌ను స్ప‌ష్టం చేశారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున రైనా ఐపీఎల్ ఆడాడు. అయితే 2022 సీజ‌న్‌లో ఆ జ‌ట్టు అత‌న్ని ఎంపిక చేయ‌లేదు. దేశానికి, రాష్ట్రానికి ప్రాతినిధం వ‌హించ‌డం గౌర‌వంగా భావిస్తున్నాన‌ని, బీసీసీఐకి, యూపీ క్రికెట్ సంఘానికి, సీఎస్కే, రాజీవ్ శుక్లాకు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు రైనా ట్వీట్ చేశారు. త‌న‌పై నమ్మ‌కం ఉంచిన‌వారికి, మ‌ద్ద‌తు ఇచ్చిన అభిమానుల‌కు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు వెల్ల‌డించారు. 2020లో అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రైనా రిటైర్ అయిన విష‌యం తెలిసిందే. రైనా 226 వ‌న్డేల్లో 5615 ర‌న్స్‌, 78 టీ20ల్లో 1605 ర‌న్స్ చేశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now