T20 World Cup 2022: ఎంఎస్‌ ధోనిని గుర్తు చేసుకుంటూ రోహిత్ శర్మపై విరుచుకుపడుతున్న అభిమానులు, రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు

ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

India vs England

ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు.

అదే సమయంలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని తలచుకుంటున్నారు. అందరి కంటే ‘మిస్టర్‌ కూల్‌’ బెటరంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో #captaincy హాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీమిండియా కెప్టెన్సీని స్వచ్చందంగా రోహిత్‌ వదులుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లిని కూడా అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఆట పట్ల అతడి అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని గట్టిగా చెబుతున్నారు. బౌలింగ్‌ బలంగా లేకపోవడం వల్లే టీమిండియా ఓడిందని కొంతమంది పేర్కొంటున్నారు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement