Vijay Mallya Meets Chris Gayle: క్రిస్ గేల్ నా ఫేవరేట్ అంటున్న విజయ్ మాల్యా, అతనితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన మాల్యా

భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు తీసుకొని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ ను కలిసి, అతనితో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. యూనివర్స్ బాస్, తనకు మంచి స్నేహితుడైన గేల్ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Vijay Mallya Meets Chris Gayle (Photo-Twitter)

భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు తీసుకొని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ ను కలిసి, అతనితో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. యూనివర్స్ బాస్, తనకు మంచి స్నేహితుడైన గేల్ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఐపీఎల్లో గేల్ ను ఆర్సీబీలోకి తీసుకున్నప్పటి నుంచి అతనితో మంచి స్నేహం కొనసాగుతోందన్నారు. తాను ఎంపిక చేసిన అత్యుత్తమ ఆటగాడు గేల్ అని ప్రశంసించారు. ఈ స్టార్ క్రికెటర్ తో దిగిన ఫొటో నెట్ లో చక్కర్లు కొడుతోంది.

ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపిన మాల్యా ఈ మధ్య విమానంలో సాధారణ క్లాస్ లో ప్రయాణం చేస్తున్న ఫొటో వైరల్ అయ్యింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మాల్యా యజమానిగా ఉన్నప్పుడు గేల్ ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2011 నుంచి 2017 సీజ‌న్ వ‌ర‌కు గేల్ ఆర్సీబీ తరఫున పోటీ పడి పలు మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. గేల్ ఆటకు ముగ్ధుడైన మాల్యా అప్పట్లో అతనికి బెంగళూరులో తన విలాసవంతమైన ఫామ్ హౌజ్ లో ఆతిథ్యం ఇచ్చేవాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

YS Jagan on Vamsi Arrest: పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి, వల్లభనేని వంశీ అరెస్ట్ అంతా ఓ కుట్ర అంటూ మండిపడిన వైఎస్ జగన్

IPL 2025 Schedule: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇక పండుగే! ఐపీఎల్ -2025 షెడ్యూల్‌ వచ్చేసింది, హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే?

Advertisement
Advertisement
Share Now
Advertisement