Virat Kohli: ఐపీఎల్-2024లో తొలి సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ, కేవలం 67 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న భారత్ స్టార్
ఐపీఎల్-2024లో తొలి సెంచరీ నమోదైంది. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 67 బంతుల్లో విరాట్ తన సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ఇది విరాట్‌కు 8వ ఐపీఎల్ సెంచరీ
ఐపీఎల్-2024లో తొలి సెంచరీ నమోదైంది. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 67 బంతుల్లో విరాట్ తన సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ఇది విరాట్‌కు 8వ ఐపీఎల్ సెంచరీ. తన ట్రేడ్ మార్క్ షాట్లతో రన్‌మిషన్ అభిమానులను అలరించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ కోహ్లితో పాటు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(44) పరుగులతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్ ఒక్క వికెట్ సాధించాడు. హోం గ్రౌండ్ లో గ్రాండ్ విక్టరీ కొట్డిన హైదరాబాద్, ఈ సీజన్ లో రెండో విజయం సాధించిన ఆరెంజ్ ఆర్మీ
Here's News