Virat Kohli Viral Video: గెలిచిన ఆనందంలో భార్యా పిల్లలకు ముద్దులు ఇస్తూ కెమెరాకు చిక్కిన విరాట్ కోహ్లీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్

విరాట్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌కు ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్‌ లండన్‌లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్‌ మాట్లాడాడు.తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు.

Virat Kohli talking to Anushka Sharma and Vamika after won the match in RCB vs PBKS IPL 2024

చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఐపీఎల్‌-2024లో బోణీ కొట్టింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది.ఈ మ్యాచ్‌లో విరాట్‌ క్లాసీ ఇన్నింగ్స్‌ ఆడి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. విరాట్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌కు ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్‌ లండన్‌లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్‌ మాట్లాడాడు.తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో సందడి చేస్తుంది. టీ20ల్లో 100 సార్లు 50 ప్ల‌స్ ర‌న్స్, తొలి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, తొలి స్ధానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్‌

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement