World Cup 2023: ఆస్ట్రేలియా అంటే పూనకాలే, ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌, పలు రికార్డులు బద్దలు కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్‌

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా సౌతాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ చరిత్ర సృష్టించాడు.ప్రపంచకప్‌-2023లో వరుసగా రెండోసారి సెంచరీ సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు

Quinton de Kock in action (Photo credit: Twitter)

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా సౌతాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ చరిత్ర సృష్టించాడు.ప్రపంచకప్‌-2023లో వరుసగా రెండోసారి సెంచరీ సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్‌ హిస్టరీలో అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు.దిగ్గజ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌(4) తర్వాత ఈ ఘనత సాధించిన హషీం ఆమ్లా(2), ఫాఫ్‌ డుప్లెసిస్‌(2), హర్షల్‌ గిబ్స్‌(2)లతో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు.

సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఎలైట్‌ లిస్టులో హషీం ఆమ్లా 27 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో డికాక్‌ అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో హర్షల్‌ గిబ్స్‌(18)ను అధిగమించాడు.వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హర్షల్‌ గిబ్స్‌(1999లో- 101 పరుగులు) రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్‌ డుప్లెసిస్‌(2019) మూడో స్థానంలో ఉన్నాడు.ఆసీస్‌ మీద ఓవరాల్‌గా డికాక్‌కు ఇది మూడో శతకం

Here's Video

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now