Yashasvi Jaiswal 200 Video: యశస్వీ జైశ్వాల్ తొలి డబుల్ సెంచరీ వీడియో ఇదిగో, భారత్ తరపున డబుల్ సెంచరీ బాదిన మూడో అతి పిన్న వయస్కుడిగా రికార్డు
తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో యశస్వీ తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైశ్వాల్ ఔటయ్యాడు.
విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో యశస్వీ తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైశ్వాల్ ఔటయ్యాడు.
టెస్టు క్రికెట్‌లో భారత్ తరపున డబుల్ సెంచరీ బాదిన మూడో అతి పిన్న వయస్కుడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. జైశ్వాల్ 22 ఏళ్ల 37 రోజుల వయస్సులో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(21 ఏళ్ల 35 రోజులు) తొలి స్ధానంలో ఉన్నాడు.ఆ తర్వాతి స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(21 ఏళ్ల 283 రోజులు) నిలిచాడు.అదే విధంగా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో టెస్టుల్లో మొదటి డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ యశస్వి జైస్వాల్ చోటు సంపాదించాడు. ఈ జాబితాలో అతడు ఆరో స్థానంలో నిలిచాడు. కరుణ్ నాయర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
తక్కువ ఇన్నింగ్స్‌ల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లు వరుసగా కరుణ్ నాయర్ – 3 ఇన్నింగ్స్‌లు, వినోద్ కాంబ్లీ – 4,సునీల్ గవాస్కర్ – 8,మయాంక్ అగర్వాల్ -8, ఛతేశ్వర్ పుజారా – 9, యశస్వి జైస్వాల్ – 10 ఉన్నారు.
Here's Video, Pics
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)