Yashasvi Jaiswal Century Video: విశాఖలో సెంచరీతో కదం తొక్కిన యశస్వి జైస్వాల్‌, విదేశీ, స్వదేశీ గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా రికార్డు

సొంతగడ్డపై తొలి శతకం నమోదు చేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఇది అతడికి రెండో సెంచరీ

Yashasvi Jaiswal (Photo-BCCI)

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అరుదైన ఘనత సాధించాడు.విశాఖపట్నంలో శుక్రవారం ఇంగ్లండ్ తో మొదలైన రెండవ టెస్టులో 149 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌... సొంతగడ్డపై తొలి శతకం నమోదు చేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఇది అతడికి రెండో సెంచరీ. గతేడాది వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో అతడు అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.డొమినికా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 171 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా డెబ్యూలోనే సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.

23 ఏళ్ల వయసు కంటే ముందు విదేశీ, స్వదేశీ గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. యశస్వి కంటే ముందు రవిశాస్త్రి, సచిన్‌ టెండుల్కర్‌, వినోద్‌ కాంబ్లి ఈ ఘనత సాధించారు. యశస్వితో సహా వీళ్లంతా రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకే ఆడటం విశేషం.  యువ స్పిన్నర్ చేతికి చిక్కిన రోహిత్ శర్మ వీడియో ఇదిగో, ఇంగ్లండ్‌ అరంగేట్ర స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ ట్రాప్‌లో పడి పెవిలియన్ చేరిన టీమిండియా కెప్టెన్‌

Here's BCCI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)