D Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్‌ గుకేశ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, మిలియన్ల మంది యువకులు పెద్ద కలలు కనడానికి నీ విజయం ప్రేరణ అంటూ ట్వీట్

ఇది అతని అసమాన ప్రతిభ, కృషి మరియు అచంచలమైన సంకల్పం యొక్క ఫలితం. అతని విజయం చెస్ చరిత్ర యొక్క వార్షికోత్సవాలలో అతని పేరును సుస్థిరం చేయడమే కాకుండా మిలియన్ల మంది యువకులను పెద్ద కలలు కనడానికి మరియు శ్రేష్ఠతను కొనసాగించడానికి ప్రేరేపించింది

D Gukesh Wins FIDE World Chess Championship 2024

భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. 18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌ షిప్‌ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.

చివరిదైన 14వ గేమ్‌లో చైనాకు చెందిన లిరెన్‌ను ఓడించిన గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నాడు. అత్యంత చిన్న వయసులో 18 ఏళ్లకే గుకేశ్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. మొత్తం 14 గేమ్‌లలో గుకేశ్ 3, లిరెన్ 2 గేమ్‌లో విజయం సాధించారు. తొమ్మిది గేమ్‌లు డ్రా అయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

వీడియో ఇదిగో, నా డ్రీమ్ కోసం పదేళ్లుగా కలలు కన్నా, ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించగానే భావోద్వేగానికి లోనయ్యానని తెలిపిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్

గుకేష్ డి తన అద్భుతమైన సాధనకు అభినందనలు. ఇది అతని అసమాన ప్రతిభ, కృషి మరియు అచంచలమైన సంకల్పం యొక్క ఫలితం. అతని విజయం చెస్ చరిత్ర యొక్క వార్షికోత్సవాలలో అతని పేరును సుస్థిరం చేయడమే కాకుండా మిలియన్ల మంది యువకులను పెద్ద కలలు కనడానికి మరియు శ్రేష్ఠతను కొనసాగించడానికి ప్రేరేపించింది. అతని భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

PM Modi Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)