Goalkeeper Arne Espeel Dies: ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం, పెనాల్టీ కిక్‌ను సేవ్ చేసి గ్రౌండ్‌లోనే హార్ట్ ఫెయిల్యూర్‌తో కుప్పకూలిన గోల్ కీపర్
బెల్జియం గోల్ కీపర్ లైవ్ మ్యాచ్‌లోనే ప్రాణాలొదిలాడు. పెనాల్టీ కిక్‌ను సేవ్ చేసిన గోల్‌కీపర్ ఆ మరుక్షణమే ప్రాణం వదలడం అభిమానులను కలచివేసింది. బ్రెజిల్‌కు చెందిన సెకండ్ ప్రొవిజనల్ డివిజన్ వెస్ట్ బ్రాబంట్‌లో వింకిల్ స్పోర్ట్ బి జట్టుకు ఆర్నే ఎస్పీల్ గోల్ కీపర్‌గా సేవలందిస్తున్నాడు.
బెల్జియం గోల్ కీపర్ లైవ్ మ్యాచ్‌లోనే ప్రాణాలొదిలాడు. పెనాల్టీ కిక్‌ను సేవ్ చేసిన గోల్‌కీపర్ ఆ మరుక్షణమే ప్రాణం వదలడం అభిమానులను కలచివేసింది. బ్రెజిల్‌కు చెందిన సెకండ్ ప్రొవిజనల్ డివిజన్ వెస్ట్ బ్రాబంట్‌లో వింకిల్ స్పోర్ట్ బి జట్టుకు ఆర్నే ఎస్పీల్ గోల్ కీపర్‌గా సేవలందిస్తున్నాడు.వెస్ట్రోజెబ్కేతో మ్యాచ్‌లో వింకిల్ స్పోర్ట్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. రెండో సగం మరికాసేపట్లో ముగుస్తుందనగా వెస్ట్రోజెబ్కేకు పెనాల్టీ కిక్ లభించింది.
అయితే గోల్‌కీపర్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వహించిన ఆర్నే స్పిల్ పెనాల్టీ కిక్‌ను అడ్డుకున్నాడు. అయితే పెనాల్టీ కిక్‌ను అడ్డుకున్న మరుక్షణమే గ్రౌండ్‌పై కుప్పకూలాడు. ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికి హార్ట్ ఫెయిల్యూర్‌తో అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్నొన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)