FIFA Lifts Suspension of AIFF: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, భారత్‌పై నిషేదం ఎత్తివేసిన ఫిఫా, వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమం
ఏఐఎఫ్‌ఎఫ్‌లో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (COA) ప్రమేయాన్ని సుప్రీం కోర్టు నిలువరించిన నేపథ్యంలో ఫిఫా (FIFA) తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
New Delhi, AUG 28: ఫుట్‌బాల్ అభిమానులకు ఊరట కల్గించే వార్త. ఆల్‌ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్‌ఎఫ్)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) ఎత్తివేసింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (COA) ప్రమేయాన్ని సుప్రీం కోర్టు నిలువరించిన నేపథ్యంలో ఫిఫా (FIFA) తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన ప్రతిష్ఠాత్మక మహిళల అండర్-17 ప్రపంచ కప్ టోర్నీ (World Cup) నిర్వహణకు మార్గం సుగమమైంది. ‘ఏఐఎఫ్‌ఎఫ్ పరిపాలన వ్యవహారాల్లో సీవోఏ కలుగజేసుకోవడంపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో తిరిగి పాలన పగ్గాలు ఏఐఎఫ్‌ఎఫ్ చేతుల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఫిఫా కౌన్సిల్ సస్పెన్షన్ ఎత్తివేతకు మొగ్గుచూపింది. ఈ కారణంగా షెడ్యూల్ ప్రకారం మహిళల అండర్-17 ప్రపంచకప్ నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. నిబంధనలకు అనుగుణంగా ఏఐఎఫ్‌ఎఫ్ ఎన్నికలు జరిగేలా ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (AFC) పర్యవేక్షిస్తుంది’ అని ఫిఫా తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)