FIFA World Cup 2022 Final: అర్జెంటినా చేతిలో ఓటమి జీర్ణించుకోలేక అల్లర్లతో అట్టుడికిన ఫ్రాన్స్, ఆందోళనకారులను అదుపుచేసెందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఓటమిని జీర్ణించుకోని ఫ్రాన్స్ అభిమానులు రాజధాని పారిస్, నీస్, లయాన్ నగరాల్లో పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి అల్లర్లకు పాల్పడ్డారు.

Civilian riots in Paris after France's defeat to Argentina in the WC final. (Photo Credit: Reuters)

ఖతర్‌లో గత రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటినా చేతిలో ఓటమి తర్వాత ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగాయి. ఓటమిని జీర్ణించుకోని ఫ్రాన్స్ అభిమానులు రాజధాని పారిస్, నీస్, లయాన్ నగరాల్లో పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి అల్లర్లకు పాల్పడ్డారు. వీధుల్లోకి భారీగా తరలివచ్చి వీరంగమేస్తున్న అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు చివరికి బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. మ్యాచ్ తర్వాత వేలాదిమంది ఫుట్‌బాల్ అభిమానులు వీధుల్లోకి చొచ్చుకొచ్చి ఆందోళనకు దిగినట్టు ‘డెయిలీ మెయిల్’, ‘ది సన్’ వంటి పత్రికలు పేర్కొన్నాయి. బాష్పవాయువు ప్రయోగంతో సాకర్ అభిమానులు పరుగులు తీయడం కొన్ని వీడియోల్లో కనిపించింది. వెనక్కి వెళ్లిపోవాలంటూ ఆందోళనకారులను పోలీసులు హెచ్చరించడం కూడా వీడియోల్లో వినిపిస్తోంది.ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా 14 వేల మంది పోలీసులను మోహరించారు. అయినప్పటికీ అల్లర్లును ఆపలేకపోయారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)