Sara Lee Dies: డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచంలో తీవ్ర విషాదం, చిన్న వయసులోనే హఠాన్మరణం చెందిన ప్రముఖ మాజీ రెజ్లర్‌ సారా లీ, విషాద వదనంతో ట్వీట్ చేసిన సారా తల్లి

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ) మాజీ రెజ్లర్‌ సారా లీ 30 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని సారా తల్లి టెర్రీ లీ శుక్రవారం ధ్రువీకరించారు.

Sara Lee Dies (Photo-Twitter)

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ) మాజీ రెజ్లర్‌ సారా లీ 30 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని సారా తల్లి టెర్రీ లీ శుక్రవారం ధ్రువీకరించారు. సోషల్‌ మీడియా వేదికగా కూతురి మరణవార్తను తెలియజేశారు. సారా ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయిందని.. ఆమె అంత్యక్రియల ఏర్పాట్లు కూడా ఇంకా పూర్తి కాలేదంటూ ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎన్‌ఎన్‌ తన కథనంలో పేర్కొంది. అయితే, ఆమె మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

కాగా 2015లో డబ్ల్యూడబ్ల్యూఈ రియాలిటీ కాంపిటీషన్‌ ‘టఫ్‌ ఎనఫ్‌’ సిరీస్‌ విజేతగా నిలిచిన సారా లీ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ విచారం వ్యక్తం చేసింది. మహిళా క్రీడాలోకంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఇక లేరనే విషాదకర వార్త తెలిసిందని.. ఆమె కుటుంబం, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement