Konica Layak Dies : భారత క్రీడా రంగంలో మరో విషాదం, జాతీయ స్థాయి యువ షూటర్ కొనికా లాయక్ ఆత్మహత్య, షూటింగ్ క్రీడలో రాణించలేకపోతున్నానని అందుకు సూసైడ్ చేసుకుంటున్నానని లేఖ

జాతీయ స్థాయి యువ షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్య (Konica Layak, National shooter, Dies by Suicide) చేసుకుంది. కోల్ కతాలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని (Konica Layak Dies by Suicide) ఉన్న స్థితిలో ఆమెను గుర్తించారు.

Sonu Sood, Konica Layak (Photo Credits: Twitter)

దేశ క్రీడా రంగంలో మరో విషాదం నెలకొంది. జాతీయ స్థాయి యువ షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్య (Konica Layak, National shooter, Dies by Suicide) చేసుకుంది. కోల్ కతాలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని (Konica Layak Dies by Suicide) ఉన్న స్థితిలో ఆమెను గుర్తించారు. తాను ఎంతో ఇష్టపడి ఎంచుకున్న షూటింగ్ క్రీడలో రాణించలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని కొనికా లాయక్ సూసైడ్ నోట్ లో పేర్కొంది. కొనికా లాయక్ ఉంటున్న హాస్టల్ గదిలోనే సూసైడ్ నోట్ లభించినట్టు పోలీసులు వెల్లడించారు. కొనికా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

గతంలో కొనికా లాయక్ కు నటుడు సోనూసూద్ ఓ జర్మన్ రైఫిల్ ను కానుకగా ఇచ్చారు. తాను షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించినా జార్ఖండ్ ప్రభుత్వం నుంచి సాయం అందలేదని కొనికా అప్పట్లో సోనూసూద్ ను ట్యాగ్ చేసింది. దాంతో వెంటనే స్పందించిన సోనూ సూద్ ఆమెకు రూ.2.70 లక్షల విలువైన్ గన్ ను (Sonu Sood in March This Year) బహూకరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif