Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో నాలుగో పతకం, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో రజత పతకం సాధించిన మనీష్ నర్వాల్
237.4 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్డు జో చేతిలో నర్వాల్ ఓడిపోయాడు. చైనాకు చెందిన యాంగ్ చావో 214.3 స్కోరుతో కాంస్య పతకాన్ని సాధించాడు. పారిస్ పారాలింపిక్స్ 2024లో షూటింగ్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం.
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పారా షూటర్లు అవనీ లేఖరా(Aanvi Lekhari) పసిడితో గర్జించగా మోనా అగర్వాల్(Mona Agarwal) కంచు మోత మోగించింది. వీళ్ల స్ఫూర్తితో అథ్లెట్ ప్రీతి పాల్(Preethi Pal) సంచలనం సృష్టించింది. ట్రాక్ విభాగంలో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల టీ35 ఫైనల్లో ప్రీతి కాంస్యం పతకం కొల్లగొట్టింది. దాంతో, పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 100 మీటర్ల ఫైనల్లో ప్రీతి చిరుతలా పరుగెత్తింది. 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న ఆమె మూడో స్థానంతో కాంస్యం ముద్దాడింది. పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మూడో పతకం, కాంస్యంతో చరిత్ర తిరగరాసిన అథ్లెట్ ప్రీతి పాల్, ట్రాక్ విభాగంలో దేశానికి ఇదే తొలి పతకం
ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత పారా షూటర్ మనీష్ నర్వాల్ 234.9 స్కోరుతో రజత పతకాన్ని సాధించాడు. 237.4 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్డు జో చేతిలో నర్వాల్ ఓడిపోయాడు. చైనాకు చెందిన యాంగ్ చావో 214.3 స్కోరుతో కాంస్య పతకాన్ని సాధించాడు. పారిస్ పారాలింపిక్స్ 2024లో షూటింగ్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం.