Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం
దీంతో షూటింగ్ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా భాకర్ చరిత్ర సృష్టించింది
Paris, July 28: పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‍లో షూటర్ మనూ భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో షూటింగ్ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా భాకర్ చరిత్ర సృష్టించింది. ఫైనల్‍లో 221.7 పాయింట్లు సాధించిన మనూ భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ విజయంతో 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన ఓటమికి రీవెంట్ తీర్చుకుంది. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన భారత తొలి మహిళా షూటర్‌గా నిలిచారు భాకర్. హాకీలో భారత్ బోణీ.. తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం
Here's Tweet:
Heartiest congratulations to Manu Bhaker for clinching the bronze medal in the air pistol event at Paris 2024! 🥉 Your relentless dedication, hard work, and passion have truly paid off. It's incredible to witness your skill and determination, bringing pride to India with each…
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)