Paris Olympics: మను బాకర్ హ్యాట్రిక్ మెడల్ మిస్, 25మీ పిస్తోల్ ఈవెంట్‌లో నాలుగో స్థానం, రెండు కాంస్యాలతో బాకర్ రికార్డు
25మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. మనూ, హంగేరియన్ షూటర్ మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరుగగా హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించే అవకాశాన్ని మనూ తృటిలో మిస్సైంది.
Paris, Aug 3: పారిస్ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడల్స్ కొట్టే అవకాశాన్ని చేజార్చుకుంది భారత షూటర్ మనూ బాకర్. 25మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. మనూ, హంగేరియన్ షూటర్ మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరుగగా హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించే అవకాశాన్ని మనూ తృటిలో మిస్సైంది.
5 షాట్ టార్గెట్‌లో మనూ కేవలం మూడింటిని షూట్ చేసింది. హంగేరికి చెందిన షూటర్ వెరోనికా మేజర్ 4 హిట్స్ కొట్టింది. 33 పాయింట్లతో కొరియా క్రీడాకారిణి జిన్ యాంగ్ తొలి స్థానంలో ఉండగా, ఫ్రాన్స్ షూటర్ కామిల్లీ జెడ్‌జివిస్కీ రెండవ స్థానంలో, వెరోనికా మూడవ స్థానంలో నిలవగా నాలుగో స్థానంలో నిలిచింది మను బాకర్. పారిస్ ఒలింపిక్స్ లో కొనసాగుతున్న హాకీ జట్టు జైత్రయాత్ర, చివరి గ్రూప్ మ్యాచ్ లోనూ విజయం సాధించిన టీమ్ ఇండియా
Here's Tweet:
పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లలో మనూ భాకర్ కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)