Vinesh Phogat Disqualified: పార్లమెంట్‌లో వినేశ్ ఫోగట్ అనర్హత వేటు ప్రకంపనలు, ఈ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టిన ఎంపీలు, వీడియో ఇదిగో..
ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. స్పందించిన ప్రభుత్వం వినేశ్ ఫొగాట్ అంశంపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా మంత్రి ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది.
ఫొగాట్‌పై అనర్హత వేటు అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ (Lok Sabha)లో లేవనెత్తారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. స్పందించిన ప్రభుత్వం వినేశ్ ఫొగాట్ అంశంపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా మంత్రి ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. గెలిచినా ఓడినా పతకమే, వినేశ్ అనర్హత వేటు వెనుక అసలేం జరిగింది, మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరించిన ఐఓఏ
ఫైనల్లో గెలిచినా ఓడినా భారత్‌కు పతకం వచ్చేది. కానీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్ వినేశ్‌పై అనర్హత ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఇంతకుమించి ఐఓఏ మరేమీ చెప్పలేదు. అయితే వినేశ్ ప్రతిభకు గౌరవం ఇవ్వాలని, చేతిలో మిగిలి ఉన్న మిగతా గేమ్‌లపై తాము దృష్టి సారిస్తున్నామని ఐఓఏ తెలిపింది.
Here's Video