Daria Kasatkina: నేను స్వలింగ సంపర్కురాలిని, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రపంచ టెన్నిస్ స్టార్, నటాలియా జబైకోతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసిన రష్యన్‌ మహిళా టెన్నిస్‌ స్టార్‌ డారియా కసత్కినా

డారియా కసత్కినా (Daria Kasatkina) స్వలింగ సంపర్కంపై సంచలన వ్యాఖ్యలు చేసింది చేసింది. తాను లెస్బియన్‌ అని సగర్వంగా చెప్పుకుంటున్నానని తెలిపింది.

Russian Tennis Star Daria Kasatkina Comes Out As Gay (Photo-Twitter)

రష్యన్‌ మహిళా టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నెంబర్‌ 12.. డారియా కసత్కినా (Daria Kasatkina) స్వలింగ సంపర్కంపై సంచలన వ్యాఖ్యలు చేసింది చేసింది. తాను లెస్బియన్‌ అని సగర్వంగా చెప్పుకుంటున్నానని తెలిపింది. కాగా ఎల్జీబీటీక్యూ(LGBTQ), హోమో సెక్సువల్‌పై రష్యా అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు (Living In The Closet Pointless) చేసింది. ఇక 1993లోనే మాస్కో అధికారికంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ... 2013 నుంచి స్వలింగ సంపర్కం అనే పదం వినిపించడానికి వీల్లేదని.. ఎక్కడా కూడా ఆ పదం వాడకూడదంటూ నిషేధం విధించింది.

తాను లెస్బియన్ అన్న విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించిన కసత్కినా.. రష్యన్ స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియా జబైకో తో (Natalia Zabiiako) కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ ‘మై క్యూటీ పై’ అని షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా గతవారం రష్యన్‌ మహిళా ఫుట్‌బాలర్‌ నడ్య కరపోవా కూడా స్వలింగ సంపర్కంపై తనదైన శైలిలో స్పందించింది. కసత్కినా స్పందిస్తూ.. ‘కరపోవా ఈ విషయంలో మాట్లాడినందుకు చాలా సంతోషం. కానీ ఇంకా చాలా మంది మాట్లాడాలి. ముఖ్యంగా అమ్మాయిలు దీని మీద గళం వినిపించాలి. ఇలాంటి సందర్భాల్లో యువతకు మద్దతు కావాలి.మరీ ముఖ్యంగా క్రీడలలో ఉండే వ్యక్తులు చాలామందిని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ల ఈ సమస్య గురించి విరివిగా మాట్లాడాలి.’ అని పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)