Khelo India Winter Games 2025: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025..మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరికి స్వర్ణ పతకం

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో భాగంగా మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరి స్వర్ణ పతకం గెలుచుకుంది

Nayana Sri Talluri (Photo credit: X @ddsportschannel)

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో తెలంగాణ ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. తెలంగాణకు చెందిన యువ ఐస్ స్కేటర్ నయన శ్రీ తల్లూరి, మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

జనవరి 24న, నయన శ్రీ తన ప్రతిభతో 01:01:35 సెకన్ల అద్భుత సమయంతో ఈ ఈవెంట్‌ను పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించింది. కర్ణాటకకు చెందిన ప్రతీక్ష రజత పతకాన్ని, స్వరూప దేశ్ముఖ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

ఈ గేమ్స్‌లో ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. జనవరి 23న ప్రారంభమైన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025, జనవరి 27 వరకు కొనసాగనుంది.  ఖోఖో మొదటి ప్రపంచ కప్ విజేత భారత్, 54-36 తేడాతో నేపాల్ జట్టును చిత్తు చేసిన టీమిండియా ప్లేయర్లు

Telangana Player Nayana Sri Talluri Wins Gold Medal at Khelo India Winter Games 2025

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement