ఖోఖో మొదటి ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అదరగొట్టింది. ఖోఖో మహిళల ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలవగా.. పురుషుల జట్టు కూడా అదే బాటలో పయనించి కప్ సొంతం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పురుషుల జట్టు విజయం సాధించింది. 54-36 తేడాతో నేపాల్ జట్టును భారత్ చిత్తు చేసింది.

ఖోఖో వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌, మహిళలు, పురుషుల విభాగాల్లోనూ ప్రపంచకప్‌ భారత్‌ సొంతం

తొలి రౌండ్‌లో 26–18 అధిక్యతతో నిలబడిన భారత్ అదే జోరును చివరి వరకూ కొనసాగించింది. అటు మహిళలు, ఇటు పురుషుల జట్టులోనూ ప్రత్యర్ధి జట్లు నేపాల్ కావడం గమనార్హం. తొలి సారిగా నిర్వహించిన ఖోఖో ప్రపంచ కప్‌లో భారత్ మహిళల జట్టు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ టోర్నీలో భారత్ 78-40 తో నేపాల్‌ను చిత్తు చేసింది.

India Men's Team Wins Kho Kho World Cup 2025

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)